నేను పెంచి పోషించిన ఐపీఎలే వరల్డ్ నెం.1: లలిత్ మోడీ

FILE
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భారీ అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఛైర్మన్ పదవి నుంచి సస్పెండ్ అయిన లలిత్ మోడీ.. తాను పెంచి పోషించిన ఐపీఎలే ప్రపంచ నెంబర్ వన్ అని వ్యాఖ్యానించారు. టాప్ బ్రాండ్‌గా ఐపీఎల్ అగ్రస్థానంలో ఉందని మోడీ ట్విట్టర్‌లో రాసుకున్నారు.

అయితే బీసీసీఐ తనపై వేసిన సస్పెండ్ వేటు, ఛార్జ్‌షీట్, ట్వీట్‌లపై మోడీ ట్విట్టర్‌లో పేర్కొనలేదు. అలాగే యూట్యూబ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లే ప్రపంచంలో నెంబర్‌వన్‌గా నిలిచాయని లలిత్ మోడీ ట్విట్టర్‌లో తెలిపారు. యూఎస్‌కు చెందిన నేషన్ల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్), సీబీఎస్ స్పోర్ట్స్ రికార్డులను కూడా బద్దలు కొడుతూ.. ఐపీఎల్ మ్యాచ్‌లు అగ్రస్థానంలో నిలిచాయని మోడీ తెలియజేశారు.

ఇదిలా ఉంటే... కాసుల పంట పండిస్తోన్న ఐపీఎల్‌లో భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్న లలిత్ మోడీని బీసీసీఐ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. మోడీ స్థానంలో బరోడా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు చిరాయు అమీన్‌ను బీసీసీఐ నియమించిన సంగతి విదితమే.

వెబ్దునియా పై చదవండి