గత ఇంగ్లాండ్, ప్రస్తుత ఆస్ట్రేలియా సిరీస్‌లలో భారత బౌలింగ్ ఘోర వైఫల్యం చెందటంతో భారత్ జట్టు బౌలింగ్ కోచ్‌గా ఇరిక్ సిమన్స్‌ను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బౌలింగ్ కోచ్ పదవి నుంచి తప్పించింది. ఈయన కాంట్రాక్టు ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనతో పూర్తి కావడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో అతని స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ జోయి డావెస్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా దక్షణాఫ్రికాకు చెందిన సిమన్స్ రెండు సంవత్సరాల (2010) నుంచి ఉన్న కాంట్రాక్టు ఆస్ట్రేలియా సిరీస్‌తో ముగిస్తుంది. అయితే అతని పదవి కాలాన్ని తిరిగి పొడిగించే ఉద్దేశ్యం లేదని బీసీసీఐ తెలిపింది.
సోమవారం చెన్నైలో జరిగిన బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్నారు. అయితే గత రెండు విదేశీ ఇంగ్లండ్ (4-0), ఆస్ట్రేలియా (4-0)లతో టెస్ట్ సిరీస్‌లో భారత్ ఘోర వైఫల్యం చెందటంతో బౌలింగ్ కోచ్‌గా సిమన్స్ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు.