తనను పెళ్లాడుతానని నమ్మించి తనపై అత్యాచారం చేసాడంటూ ఓ వివాహిత ఓ మైనర్ బాలుడిపై కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసును ఉత్తరాఖండ్ కోర్టు విచారిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. మైనర్ పిల్లవాడు పెళ్లాడుతానంటే మీరెలా అంగీకరించారు? పైగా ఇప్పటికే మీరు వివాహితులు, పైగా మీకు సంతానం కూడా వుంది. మైనర్ వ్యక్తి పెళ్లికి అనర్హులు అని తెలియదా? అంటూ ప్రశ్నించింది.
మైనర్ బాలుడు పెళ్లి పేరుతో అత్యాచారం చేసాడన్నదాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. కేసును కొట్టివేస్తూ... మైనర్ బాలుడిపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దని తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సమాజంలో ఇటువంటి పోకడలపై గట్టిగా బుద్ధి చెప్పినట్లయింది. ఎందుకంటే... తొలుత ఇష్టంతోనే సంబంధాన్ని సాగించి ఆ తర్వాత ఇలాంటి కేసులను పెడుతున్నట్లు చాలా కేసుల్లో రుజువైన సందర్భాలున్నాయి.