ముక్కోణపు వన్డే సిరీస్ : భారత్ విజయలక్ష్యం 237 పరుగులు
మంగళవారం, 14 ఫిబ్రవరి 2012 (13:24 IST)
File
FILE
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా మంగళవారం అడిలైడ్‌లో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక సారథి మహేళ జయవర్థనే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో లంకేయులు 236 పరుగులు చేయడంతో భారత్ ముంగిట 237 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో శ్రీలంక జట్టు పరుగులు చేయడం గగనంగా మారింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ తరంగా (0) ఖాతా తెరవకుండానే వినయ్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. డాషింగ్ ఓపెనర్ దిల్షాన్ (16) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కులేకపోవటంతో శ్రీలంక కష్టాలలో పడింది.
తర్వాత వచ్చిన కీపర్ సంగక్కర (31)తో యువ బ్యాట్స్‌మెన్ దినేష్ చందిమాల్(81)లు కలిసి కొద్దిసేపు వికెట్లు పడకుండా కాపాడుతూ స్కోరు బోర్డును కదిలించారు. ఈ క్రమంలో చందిమాల్ అర్థ శతకాని పూర్తి చేసుకున్నాడు.
కెప్టెన్ జయవర్థనే (43), ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాణించిన ఆల్ రౌండర్ మ్యాథ్యూస్ (17), పెరీరా (5), కులశేఖర (12)లు రాణించారు. అయితే చివర్లో శ్రీలంక బౌలర్ సచిత్ర సేననాయక (14 బంతుల్లో 22) వేగంగా పరుగులు సాధించటంతో శ్రీలంక 236/9 గౌరవ ప్రధమైన స్కోరు సాధించింది. భారత్ బౌలర్లలో వినయ్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయగా, అశ్విన్‌కు రెండు, ఇర్ఫాన్ పఠాన్‌కు ఒక వికెట్ దక్కాయి.