వాన్ లేకుంటే యాషెస్ విజయం కష్టమే

మంగళవారం, 5 ఆగస్టు 2008 (16:52 IST)
కెప్టెన్‌గా మైకేల్ వాన్ లేకుంటే 2009 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ విజయం కష్టమేనని ఆస్ట్రేలియా మాజీ స్పిన్ ధిగ్గజం షేనా వార్న్ చెప్పారు. కెప్టెన్‌గా వాన్ సేవలు 2009 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌కు అత్యావశ్యకమని అభిప్రాయపడ్డారు. సారథిగా వాన్ చాలా గొప్పవాడని వార్న్ శ్లాఘించాడు.

ఇంగ్లాండ్ కొత్త కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఎంత మేరకు రాణించగలడనేదే తన అనుమానమని వార్న్ ఆందోళన వ్యక్తం చేశాడు. పీటర్సన్ తన ఆలోచనలకు అనుభవాలు జోడించినట్లయితే ఇంగ్లాండ్‌కు విజయాలు సాధించిపెడతాడని అన్నారు. క్రికెటర్‌గా పీటర్సన్ మంచి ప్రావీణ్యత గలవాడని వార్న్ కొనియాడాడు.

కెప్టెన్ పీటర్సన్ భవిష్యత్తులో ఐసీసీ ర్యాంకుల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ జట్టులో అత్యుత్తమ క్రికెటర్ పీటర్సన్ ఒక్కడే అని వార్న్ వెల్లడించారు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తున్న 2009 యాషెస్ సిరీస్ ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాళ్ల కెరీర్‌లో ఇదే ఆఖరుది కావచ్చు. ముఖ్యంగా ఓపెనర్ మాథ్యూ హెడెన్, కెప్టెన్ రికీ పాంటింగ్‌లు.

వెబ్దునియా పై చదవండి