సిడ్నీ విజయానికి విమర్శలే కారణం: పాంటింగ్

FILE
పాకిస్తాన్‌తో జరిగిన బాక్సింగ్‌ డే రెండో టెస్టులో విజయం సాధించడానికి ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ విమర్శలే కారణమని చెబుతున్నాడు. మాజీ క్రికెటర్ల చేసిన విమర్శల కసితో గెలుపును సొంతం చేసుకున్నామని రికీ అన్నాడు.

రెండో టెస్టు మధ్యలో తమపై వచ్చిన విమర్శలు జట్టులో కసిని పెంచాయని పాంటింగ్ చెప్పాడు. దీంతో తమ ఆటగాళ్లలో పోరాట స్ఫూర్తి రగిలి మ్యాచ్‌ను చేజిక్కించుకున్నామని చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో తమ జట్టు ఆటగాళ్లు విజృంభించడంతో మంచి ఫలితం లభించిందని రికీ తెలిపాడు.

ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో సిడ్నీలో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 36 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ల గట్టిపోటీ, బౌలర్ల తడాఖాతో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది.

వెబ్దునియా పై చదవండి