మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తానో.. చెప్పలేను.!: బ్రెట్ లీ
PTI
ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు స్వస్తి చెప్పిన ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్ తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తానో చెప్పలేనని అంటున్నాడు. గాయంతో గత ఏడాది కాలంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ ఫ్లింటాఫ్, గత యాషెన్ సిరీస్ సందర్భంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న ఫ్లింటాఫ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్‌లోనూ ధీటుగా రాణించలేకపోతున్నాడు. మరోవైపు యాషెస్ సందర్భంగా ఏర్పడిన గాయం నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న ఫ్లింటాఫ్.. తిరిగి జట్టులోకి ఎప్పుడు వస్తానో తెలియట్లేదన్నాడు. గాయం నుంచి కోలుకుని, జట్టులోకి చేరే ఆ శుభదినం కోసం వేచి చూస్తున్నానని ఫ్లింటాఫ్ చెప్పుకొచ్చాడు.
ఫిట్‌నెస్ లేమీతో ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఫ్లింటాఫ్, ట్వంటీపై దృష్టి సారించాలని భావించాడు. కానీ గాయాలు తగ్గక పోవడంతో మళ్లీ జట్టులోకి ఎప్పుడొస్తానో తెలియడం లేదని ఫ్లింటాఫ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
కాగా ఐపీఎల్ ట్వంటీ-20 పోటీల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న బ్రెట్‌లీని ఇప్పటికే ఆసీస్ జట్టు ఈ నెల 30వ తేదీన ప్రారంభం కానున్న ప్రపంచకప్ ట్వంటీ-20 జట్టులో స్థానం కల్పించడం గమనార్హం.