వారి భవిష్యత్తును తేల్చాల్సింది నేను కాదు : శ్రీనివాసన్

శనివారం, 25 ఫిబ్రవరి 2012 (09:34 IST)
ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరవైఫ్యంలో చెందిన భారత్ జట్టులో ఈ పర్యటన అనంతరం భారీ మార్పులు జరగనున్నాయా? టెస్ట్ సిరీస్‌ ఓటమితో ఇప్పటికే అప్రతిష్టను మూటగట్టుకున్న జట్టులోని సీనియర్లపై వేటుపడనుందా? అంటే అవుననే సంకేతాలొస్తున్నాయి.

ప్రస్తుతం ముక్కోణపు సిరీస్‌లో జరుగుతున్న రొటేషన్ విధానంపై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో శుక్రవారం బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ తొలిసారిగా ఈ విషయంపై స్పందించారు.

ప్రస్తుత్త పర్యటనలో రొటేషన్ విధానంపై తమకేమి సంబంధం లేదని అంతా జట్టు యాజమాన్యమే చూసుకుంటుందని తెలిపారు. ఏం జరుగుతుందో నేను జోస్యం చెప్పలేను. నేని సెలక్టర్‌ను కాదని అయితే ప్రపంచంలోని ప్రతీ శక్తి వంతమైన జట్టుకు మార్పు తప్పదని తెలిపారు.

కాగా ఈ విషయంలో తెరపైన బీసీసీఐ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నపట్టికీ తెర వెనుక మాత్రం జోరుగానే పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీనియర్ల భవితవ్యాన్ని తేల్చాల్సింది సెలక్టర్సేనని స్పష్టం చేశాడు.

అయితే బోర్డ్ ఆదేశాలు లేకుండా సీనియర్లపై సెలక్టర్స్ ఓ నిర్ణయం తీసుకునే దైర్యం చేయరన్న సంగతి అందరికి తెలిసిన విషయమే. పర్యటన మధ్యలో ఉన్న జట్టు ప్రదర్శనపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనన్ని శ్రీనివాసన్ తెలిపారు. తదుపరి పరిణామాలపై మాట్లాడుతూ వేచి చూడండి అంటూ వ్యాఖ్యానించారు.

వెబ్దునియా పై చదవండి