పూర్తి పేరు : బి.యువరాజ్ సింగ్ పుట్టింది : పంజాబ్ రాజధాని ఛండీఘర్. వయస్సు : 25 ఏళ్లు ఆడే జట్లు : ఇండియా, ఆసియా లెవెన్, పంజాబ్, యార్క్‌షైర్ బ్యాటింగ్ శైలి : ఎడమ చేతివాటం బౌలింగ్ : స్లో లెఫ్ట్ ఆర్మ్
'భారత్ బెవాన్'గా క్రికెట్ అభిమానుల నుంచి నీరజనాలు అందుకుంటున్న యువరాజ్ సింగ్ తొలుత వన్డే జట్టులో స్థానం సంపాదించాడు. 2000 సంవత్సరంలో అక్టోబరు మూడో తేదీన కెన్యాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన యువరాజ్ ఎక్కువ కాలం వన్డే బ్యాట్స్‌మెన్‌గా ముద్రవేసుకున్నాడు. దాదాపు రెండేళ్ళ అనంతరం అంటే.. 2003లో స్వదేశంలో జరిగిన టెస్టు మ్యాచ్‌కి ఎంపికయ్యాడు.
యువరాజ్ తన తొలి టెస్టు మ్యాచ్‌ని న్యూజిలాండ్‌పై అక్టోబరు 16వ తేదిన ఆడాడు. కొత్త క్రికెట్ ఫార్మెట్ అయిన ట్వంటీ-20లో ఆరు బంతులలో ఆరు సిక్సర్లు సాధించి ప్రపంచ రికార్డు పుటల్లో తన పేరును చేర్చుకున్న ఈ పంజాబ్ పులి ఇదే ట్వంటీ-20లో 12 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసి అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పాడు.
ఇప్పటి వరకు 19 టెస్టులు ఆడి 830 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు మూడు అర్థ సెంచరీలు వీటిలో ఉన్నాయి. అధ్యధిక స్కోరు ఇంగ్లాండ్‌పై చేసిన 122 పరుగులు. అలాగే.. 183 వన్డేలు ఆడిన యువరాజ్ 5,109 పరుగులు చేశాడు. వీటిలో ఏడు సెంచరీలు, 30 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
స్ట్రైక్ రేటు 87 శాతంగా ఉండగా.. పాకిస్థాన్‌పై చేసిన 139 యువరాజ్ సింగ్ అత్యధిక స్కోరు కావడం గమనార్హం. వన్డేల్లో స్లో బౌలర్‌గా పేరుగాంచిన యువరాజ్ ఇప్పటివరకు 183 మ్యాచ్‌లలో 49 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ 4/06. అలాగే.. టెస్టుల్లో 19 టెస్టు మ్యాచ్‌లలో కేవలం ఒక వికెట్ తీసుకున్నాడు.