కాగా, 'హరి హర వీరమల్లు' చిత్రం సంబంధించిన అన్ని ప్రమోషన్లు దాదాపు పూర్తయ్యాయి. మరి జులైలో ఏదైనా పెద్ద ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన 'హరి హర వీరమల్లు'లో బాబీ డియోల్ ముఖ్య పాత్ర పోషించారు.
తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా, నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నరా ఫతేహి