కటక్‌లోని బారాబతి స్డేడియంలో ఇంగ్లాండ్‌తో బుధవారం ప్రారంభమైన ఐదోవన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఏడు వన్డేల సిరీస్‌ను 4-0 తేడాతో ఇప్పటికే సొంత చేసుకున్న భారత్ మిగిలి మూడు వన్డేల్లో ప్రయోగాలు చేయడానికి సిద్ధమైంది.
ఇందులో భాగంగా మంచి ఫాంలో ఉన్న గంభీర్‌ను పక్కనపెట్టి రోహిత్‌శర్మను జట్టులోకి తీసుకుంది. అలాగే మునాఫ్ పటేల్ స్థానంలో ఇర్ఫాన్ పఠాన్‌ను జట్టులోకి తీసుకుంది.
భారత జట్టు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనా, మహేంద్రసింగ్ ధోనీ, యువరాజ్ సింగ్, యూసఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, జహీర్‌ఖాన్, ఇషాంత్‌శర్మ.
ఇంగ్లాండ్ జట్టు కుక్, రవి బొపారా, షా, పీటర్సన్, ఫ్లింటాఫ్, కాలింగ్‌వుడ్, ప్రియర్, పటేల్, బోర్డ్, స్వాన్, హార్మిసన్.