నాగ్‌పూర్‌ టెస్ట్: రెండో వికెట్‌ను కోల్పోయిన ఆసీస్

నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఐదో రోజు ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన వెంటనే రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ కటిచ్ 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిగాడు. అప్పటికి ఆసీస్ స్కోర్ 29 పరుగులు. ఆ తర్వాత ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ రికీ పాంటింగ్.. లేని పరుగు కోసం పరుగెత్తాడు.

అవతి ఎండ్‌లో ఉన్న అమిత్ మిశ్రా మెరుపువేగంతో బంతిని అందుకుని వికెట్లను గిరాటేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ జట్టు 37 పరుగులకే రెండో వికెట్‌ను కోల్పోయింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కటిచ్‌ కూడా అంపైర్ బిల్లీ బౌడెన్ చలువతో బయటపడ్డారు. ఇషాంత్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయినప్పటికీ.. అంపైర్ ఔట్‌కు తిరస్కరించడంతో బతికిపోయాడు. క్రీజ్‌లో ప్రమాదకర ఓపెనర్ హెడెన్ (19), క్లార్క్‌ (3)లు ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి