అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

దేవి

శనివారం, 8 ఫిబ్రవరి 2025 (12:38 IST)
Chiranjeevi Video Conference with Modi
WAVES (వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్) కోసం అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి సోష‌ల్ మీడియా వేదిక‌గా ధ‌న్య‌వాదాలు తెలిపారు. మోదీతో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడుతున్న వీడియోను చిరంజీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌ధాని ఆలోచనలు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నారు.
 
ఇతర గౌరవనీయ సభ్యులతో కలిసి నేను పంచుకోవడం నిజంగా ఒక విశేషం. శ్రీ మోదీ జీ మెదడు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తాయనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. భార‌త్‌ను గ్లోబ‌ల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ హ‌బ్‌గా మార్చాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ఈ ఏడాది చివ‌రిలో ‘వరల్డ్‌ ఆడియో విజువల్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమ్మిట్‌(WAVES)’ను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో వేవ్స్ 2025 గురించి చ‌ర్చించేందుకు ప్ర‌ధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశవిదేశాలకు చెందిన సినీ, వ్యాపార ప్రముఖులతో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా స‌మావేశాన్ని నిర్వ‌హించారు.
 
 ఈ కానఫరేన్స్ లో స‌మ్మిట్ కోసం స‌ల‌హాలు, సూచ‌న‌లు ప్ర‌ధాని తీసుకున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, మోహన్ లాల్, రజ‌నీకాంత్, ఆమిర్ ఖాన్, ఏఆర్ రెహమాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనే, ముఖేష్ అంబానీ, సీఈఓ సుందర్ పిచాయ్, సీఈఓ సత్య నాదెళ్ల, ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపార‌వేత్త‌లు  పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు