వెస్టిండీస్‌తో జరిగిన నాట్‌వెస్ట్ వన్డే సిరీస్‌ను 0-2తో ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణంకాగా, మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లాండ్ నెగ్గింది. మంగళవారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 58 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై విజయభేరి మోగించింది.
ఇంగ్లాండ్ ఉంచిన 329 పరుగుల లక్ష్యానికి బదులుగా వెస్టిండీస్ 49.4 ఓవర్లలో 270 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయింది. సీనియర్ బ్యాట్స్‌మెన్ చందర్‌పాల్ (68), రామ్‌దిన్ (45), బౌలర్ బెన్ (31) జట్టును విజయతీరాలకు చేర్చేందుకు విఫలయత్నం చేశారు. భారీ విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ప్రారంభంలోనే కీలక వికెట్లు చేజార్చుకొని వెస్టిండీస్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంది.
అనంతరం చందర్‌పాల్, బ్రావో, రామ్‌దిన్‌లు ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ, ఇంగ్లాండ్ బౌలర్ల వారికి అడ్డుకట్ట వేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆండర్సన్ మూడు వికెట్లు పడగొట్టగా, స్టువర్ట్ బ్రాడ్ రెండు వికెట్లు, బ్రెస్నాన్, స్వాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
దీంతో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. ఓపెనర్లు స్ట్రాస్ (52), రవి బొపారా (49), ప్రియర్ (87), ఓవైష్ షా (75) రాణించడంతో ఇంగ్లాండ్‌కు భారీ స్కోరు సాధ్యపడింది. అత్యధిక పరుగులు చేసిన ప్రియర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. స్టువర్ట్ బ్రాడ్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.