కరీబియన్ పర్యటనలో భారత్ బోణి కొట్టింది. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఓపెనర్ అజింక్యా రహానే శతకంతో చెలరేగగా, ధావన్, కోహ్లీ అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక యువ బౌలర్ కుల్ధీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ విండీస్‌పై సునాయసంగా విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. తొలి వన్డేలో అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న రహానే ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో శతకం (104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) బాదాడు. అతడికి తోడు కెప్టెన్ కోహ్లి (66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించగా భారత్ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు.
భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్ భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్ షై హోప్(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్ బౌలర్లలో భువీ 2, కుల్దీప్ యాదవ్ (3), అశ్విన్ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది.
తొలి వన్డే వర్షార్పణం అయ్యాక అతి చప్పగా, ఏకపక్షంగా ముగిసిన వన్డే ఇది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు రంగాల్లోనూ అదరగొట్టిన టీమిండియా విజయం అభిమానులకు సంతృప్తి కలిగించవచ్చేమో కానీ, ఇలాగే మరి కొన్ని గేమ్‌లు ఆడితే వన్జే గేమ్ కూడా చచ్చి ఊరుకుంటుందన్నది వాస్తవం. ఇక టీమిండియాలో అజింక్యా రహానే నిజంగానే మెరిశాడు. ఛాంపియన్స్ ట్రోపీలో ఛాన్స్ దక్కించుకోలేక పోయిన రహానే ఆకలి గొన్న వాడిలాగా తొలి వన్డేలో అర్థ శకతం, రెండో వన్డేలో శతకం బాది ఓపెనర్‌గా తన స్థానం అమూల్యమైనదని చాటి చెప్పాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే దక్కింది. టీమిండియా తరపున తొలి వన్డే ఆడుతున్న కులదీప్ యాదవ్ అద్బుతంగా ఆడి మూడు వికెట్లు తీయడం కె్ప్టెన్ ప్రశంసలు అందుకుంది.