మొహాలీలో శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సిరీస్‌లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో 'టీమ్ ఇండియా' ఘన విజయం సాధించింది. కాగా, రెండో టెస్టు మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ మైదానంలో ప్రారంభమైంది.
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మొహాలీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతను కల్పించారు. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఫామ్‌లో లేక తంటాలు పడుతున్న భారత సీనియర్ బ్యాట్స్‌మెన్ రాహుల్ ద్రావిడ్‌కు తుది జట్టులో చోటు కల్పించారు. అంతేకాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో రాహుల్ స్థానాన్ని మార్పు చేయబోమని కెప్టెన్ ధోనీ స్పష్టం చేశారు. ఇరు జట్ల వివరాలు.