యూపీలో కిడ్నాప్.. హైదరాబాదులో వారం రోజుల పాటు అత్యాచారం..

మంగళవారం, 28 నవంబరు 2023 (22:46 IST)
మహిళలపై అకృత్యాలు ఏమాత్రం తగ్గట్లేదు. తాజాగా యూపీకి చెందిన బాలికపై దారుణం జరిగింది. ఆ మైనర్‌ను ఓ యువకుడు కిడ్నాప్ చేసి హైదరాబాద్ అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలికను కొన్ని రోజుల కిందట ఓ యవకుడు కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
బాలిక కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. నవంబర్ 25వ తేదీన బల్లియాలోని మణియార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతం నుంచి బాలికను రక్షించారు. పొరుగింటివాడే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 19 ఏళ్ల  నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడైన యువకుడు తనను కిడ్నాప్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లి దాదాపు వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక తన వాంగ్మూలంలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు