మూడు నెలలుగా 13 ఏళ్ల బాలికను బెదిరిస్తూ అత్యాచారం, పట్టుకోబోయేసరికి పరార్

శనివారం, 11 జూన్ 2022 (12:13 IST)
చండీగఢ్‌లో 13 ఏళ్ల బాలికను బెదిరిస్తూ మూడు నెలలుగా ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేస్తున్నాడు. యుక్తవయస్సులో ఉన్న బాలుడు మొదట తమ ఇంట్లో, ఆ తర్వాత అతడి ఇంట్లో అత్యాచారం చేశాడని బాలిక చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిందన్న విషయం తెలుసుకున్న బాలుడు పరారయ్యాడు. అత్యాచారం చేసిన బాలనేరస్థుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 
మౌలి జాగరణ్‌లోని నివాసి, యుక్తవయస్సులో ఉన్న బాలుడు మార్చిలో పంచకులలోని బుద్దన్‌పూర్ గ్రామంలోని తన ఇంట్లో తనపై మొదటిసారి అత్యాచారం చేశాడని, బెదిరించి, తన ఇంట్లో మళ్లీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 
బాలిక ఆరోగ్యంలో తేడా రావడంతో తల్లి నిలదీసింది. దీనితో బాలిక అసలు విషయం చెప్పింది. బాధిత బాలికను తీసుకుని తల్లి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 376 (2)(ఎన్) (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), సెక్షన్ 6 (తీవ్రమైన లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు