ఇటీవలికాలంలో భర్తలను భార్యలు వివిధ రకాలైన వేధింపులకు గురిచేస్తున్నారు. వీటిని భరించలేని వివాహితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగుళూరుకు చెందిన ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రశాంత్ నాయర్, పూజా నాయర్ మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ కారణంగా విడాకులు తీసుకోవాలని భావించారు. అయితే, భర్తను మరింతగా వేధించడం మొదలుపెట్టింది. ఈ వేధింపులను తాళలేని ప్రశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ క్రమంలో తన కుమారుడు ప్రశాంత్‌కు తండ్రి పదేపదే ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అతను ఫ్యానుకు వేలాడుతూ కనిపించాడు. సంఘటన స్థలంలో పోలీసలకు ఎటువంటి సూసైడ్ లేఖ కనిపించలేదు. ఈ ఘటనపై సోలదేవనహళ్లి పోలీస్ స్టేషనులో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేధింపుల ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా, ఈ యేడాది జనవరి నెలలో యూపీకి చెందిన టెక్కీ అతుల్ సుషాష్ ఆత్మహత్య కేసు బెంగుళూరులో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అతుల్ తన ఆత్మహత్యకు ముందు 24 పేజీల సూసైడ్ లేఖ, గంటన్నర వీడియోలో తన భార్య, అత్తలు కలిసి ఎలా వేధించారో పూసగుచ్చినట్టు వివరించాడు. పైగా, తనపై అక్రమ గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టారని ఆరోపించాడు. ఇపుడు ప్రశాంత్ నాయర్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.