ఇల్లు కట్టిపెట్టమంటే ఇల్లాలితో లింకు పెట్టుకున్నాడు, అంతే...

మంగళవారం, 21 డిశెంబరు 2021 (16:35 IST)
అతడో తాపీ మేస్త్రీ. ఇంటి నిర్మాణ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇతడికి మరో స్నేహితుడున్నాడు. ఇద్దరూ కలిస్తే ఇల్లు నిర్మాణం ఇట్టే పూర్తవుతుంది. అలా ఇద్దరూ కలిసి పనిచేస్తుండేవారు. 

 
అనంతపురం జిల్లా రూరల్ మండలం నందమూరి నగర్‌లో తాపీమేస్త్రీ గురుమూర్తి తను సొంత ఇంటిని కట్టుకోవాలనుకున్నాడు. తన ఆలోచనను స్నేహితుడు రాజేష్‌తో చెప్పాడు. ప్లాన్, ఇతర ఖర్చుల గురించి మాట్లాడుకుందాం ఇంటికి రమ్మని రాజేష్‌ను ఆహ్వానించాడు.

 
ఇల్లు ఎలా కట్టాలన్న విషయంతో పాటు గురుమూర్తి భార్యపైనా కన్నేశాడు రాజేష్. గురుమూర్తి ఇంట్లో లేనప్పుడు ఇంటిపని వంకతో తరచూ ఆమె వద్దకు రావడం మొదలుపెట్టాడు. అలా వస్తూ... మెల్లగా గురుమూర్తి భార్యను లొంగదీసుకున్నాడు. ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

 
ఈ విషయం గురుమూర్తికి తెలియడంతో స్నేహితుడిని మందలించాడు. పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాడు. రాజేష్ అతడి మాటలు పట్టించుకోలేదు. స్నేహితుడికి నిజం తెలిసింది కనుక ఇక భయం లేదన్నట్లు నిర్భయంగా గురుమూర్తి ఇంటికి వచ్చి అతడి భార్యతో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక లాభం లేదనుకున్న గురుమూర్తి స్నేహితుడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

 
అతడిని మందు పార్టీ పేరుతో దూరంగా తీసుకెళ్లాడు. మరో ఇద్దరు సాయంతో కలిసి రాజేష్‌కు పూటుగా మద్యం తాగించాడు. ఆ తర్వాత అతడి మెడపై కొడవలితో నరికి చంపేసి శవాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. ఊరి చివర శవం వుందని తెలియడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య గావింపబడిన వ్యక్తి రాజేష్ అని గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు