హైదరాబాదులో వరుస అత్యాచారాల కలకలం: నెలకు 360 అదృశ్యం కేసులు, అమ్మాయి ఏం చేస్తుందో తెలుసుకోరా?

బుధవారం, 8 జూన్ 2022 (14:35 IST)
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఇటీవలి కాలంలో వరుస అత్యాచార ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. మైనర్ బాలికలపై వరుస అత్యాచారాలు జరుగుతున్నాయి. తమ కుమార్తె కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తే పలు స్టేషన్లలో తగు స్పందన కరవవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.


సగటున నెలకి 360 మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయనీ, లెక్కలు బహిర్గతం చేస్తే హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయంతో కిందిస్థాయి అధికారులు నోరు మెదపడంలేదన్న విమర్శలు వస్తున్నాయి.

 
ఎవరైనా తమ కుమార్తె కనిపించడంలేదని పోలీసు స్టేషనుకు వస్తే... మిస్సింగ్ కేసు పెట్టి పంపేస్తున్నారట. మరింత ప్రశ్నిస్తే... మీకు ఎవరి పైనైనా అనుమానం వుందా... మీ అమ్మాయి ఎవరితోనైనా చనువుగా వుంటుందా వంటి ప్రశ్నలు వేయడమే కాకుండా... ఇంట్లో అమ్మాయి ఏం చేస్తుందో తెలుసుకోరా అంటూ తల్లిదండ్రులను ఛీత్కరించుకుంటున్నారట పలువురు పోలీసులు.

 
జరగాల్సిన దారుణం జరిగిన తర్వాత తల్లిదండ్రులు తిరిగి పోలీసులను ఆశ్రయిస్తే అప్పుడు మాత్రం పోలీసులు స్పందించి నిందితులను అరెస్ట్ చేస్తున్నారనీ, ముందుగా స్పందన వుండటంలేదని పలువురు బాధితులు వాపోతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు