ఈ నెల 3వ తేదీన వసతిగృహం అధికారులకు చెప్పగా వారు పోలీసులకు అదేరోజు రాత్రి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న హుమాయూన్‌నగర్ పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాల ఆధారంగా ఒక అత్యాచారం కేసును రాంగోపాల్‌పేట పోలీస్ ఠాణాకు, మరోదాన్ని రాజేంద్రనగర్ పోలీస్ ఠాణాకు 'జీరో ఎఫ్‌ఐఆర్'గా నమోదు చేసి బదిలీ చేశారు.
ఈ వసతి గృహంలో ఉండే విద్యార్థినికి కళాశాలలో ఇద్దరు విద్యార్థులు స్నేహితులయ్యారు. వీరు ముగ్గురూ తరచూ కలుస్తూ మాట్లాడుకుంటున్నారు. ఏప్రిల్ 25వ తేదీన ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. సినిమాకు వెళ్దామంటూ ఓ స్నేహితుడు ప్రతిపాదించాడు. దీనికి ఆ యువతి సమ్మతించింది. ఆ తర్వాత ముగ్గురూ అదేరోజు రాత్రి కారులో అత్తాపూర్‌లోని మల్టీప్లెక్స్‌కు వెళ్లారు.
శీతలపానీయం తాగుదామంటూ చెప్పి ఆమెను ఓ స్నేహితుడు బయటకు తీసుకువచ్చాడు. మాల్‌లో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. సంక్షేమశాఖ అధికారులు శుక్రవారం రాత్రి తోటి విద్యార్థిని ప్రశ్నించినప్పుడూ తనపైనా అత్యాచారం జరిగిందని ఈమె చెప్పడంతో విషయం బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.