ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం... ఫారెస్ట్ రేంజర్ రొటీన్ చెకింగులో భాగంగా చెక్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇంతలో అతడికి ఎదురుగా పెద్దపులి వచ్చేసింది. వెంటనే అతడిపై దాడి చేసి తలను కొరుకుతూ ఆ తర్వాత మెడను కొరికేసి చంపేసింది. ఆ తర్వాత మృతదేహం వద్ద 20 నిమిషాల పాటు అలాగే వుండిపోయింది. ఈ దారుణాన్ని చూసినవారు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజర్ మృతదేహం దగ్గర్నుంచి అతికష్టమ్మీద పెద్దపులిని తరిమేశారు. అనంతరం అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.