ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, గర్భవతినయ్యానని చెబితే పంచాయతీ పెట్టాడు, ఆ తర్వాత?

శనివారం, 19 ఫిబ్రవరి 2022 (16:05 IST)
యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళయి సంవత్సరం అవుతోంది. సంవత్సరం తరువాత అతనికి అనుమానం వచ్చింది. అది కూడా భార్య గర్భవతి అయిన తరువాత. తన భార్య కడుపులో ఉన్నది తన బిడ్డ కాదంటూ మొండికేశాడు. పంచాయతీ పెట్టాడు. అయితే పంచాయతీలోను అదే మాట పదేపదే చెప్పేయడంతో ఆ వివాహిత..

 
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా సూలూరు సమీపంలోని రావత్తూరులో నివాసముంటున్న జీవానందం 20 యేళ్ళ యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. పెళ్లయి సంవత్సరం పూర్తయ్యింది. కాపురం సజావుగానే సాగుతోంది. అయితే భార్య గర్భవతి అయ్యింది. భర్తకు చెప్పింది. భార్య గర్భవతి అని చెప్పగానే ఎవరైనా ఆనందపడతారు. కానీ జీవానందం మాత్రం అనుమానపడ్డాడు. అప్పుడే గర్భవతి అయ్యావా అంటూ ప్రశ్నించాడు.

 
భర్త ప్రశ్నకు భార్య నిశ్చేష్టురాలైంది. భర్త ఎందుకు ఇలా అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు వెళ్ళి పంచాయతీ పెట్టాడు. ఇంకేముంది భార్య తీవ్ర ఆవేదనకు గురైంది. తనతో సంసారం చేసిన భర్తే ఎందుకు అలా మాట్లాడుతున్నాడో తెలియక ఆమెకు తీవ్ర ఆవేదనకు గురైంది. మనస్థాపంతో ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఆత్మహత్య చేసుకుంది. దీంతో జీవానందంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు