అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి హత్య చేసిన అత్త... ఎక్కడ? (Video)

వరుణ్

శుక్రవారం, 28 జూన్ 2024 (09:48 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కోడలిని అత్త చంపేసింది. తాను అడగ్గానే కోడలు టీ ఇవ్వకపోవడంతో అత్త ఈ దారుణానికి ఒడిగట్టింది. కోడలిని గొంతు నులిమి ప్రాణాలు తీసింది. మృతురాలిని 28 యేళ్ల అజ్మీరా బేగంగా గుర్తించారు. గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. 
 
స్థానిక పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నగరానికి చెందిన ఫర్జానా అనే మహిళ.. తన కోడలిని టీ అడ్గా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అత్త ఫర్జానా... కోడలి వెంట వంటింట్లోకి వెళ్లి చున్నీని వెనుక నుంచి కోడలి మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
 
అత్తాకోడళ్ళ మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి ఫర్జానా అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. 

 

ఛాయ్ పెట్టలేదని కోడలిని చున్నీతో ఉరివేసి చంపేసిన అత్త

హైదరాబాద్ - అత్తాపూర్‌లోని హసన్ నగర్ ప్రాంతంలో అత్త(ఫర్జాన) ఇవాళ ఉదయం చాయ్ పెట్టి ఇవ్వమని కోడలు అజ్మీర బేగం(28)కి చెప్పింది. అందుకు ఆమె నిరాకరించింది.

దీంతో కోపంలో చున్నీతో కోడలు మెడకు బిగించి ఉరివేసి చంపేసింది. pic.twitter.com/vJmhqYsdwi

— Telugu Scribe (@TeluguScribe) June 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు