మెంటల్ టెన్షన్ భరించలేకపోతున్నా, అందుకే దూకేస్తున్నా: ఐఐటీ బాంబే విద్యార్థి సూసైడ్ నోట్

మంగళవారం, 18 జనవరి 2022 (21:58 IST)
మరో ఐఐటి విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన మెంటల్ టెన్షన్ అనుభవిస్తున్నాననీ, అందువల్ల ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అతడు సుసైడ్ నోట్ రాసి ఏడో అంతస్తు నుంచి దూకేసాడు.

 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఐఐటీ బాంబేకి చెందిన 26 ఏళ్ల దర్శన్ పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఐతే సోమవారం తెల్లవారు జామున కళశాల హాస్టల్ ఏడంతస్తుల భవనం పైనుంచి దూకేసాడు. భవనంపై నుంచి కిందపడిన దర్శన్‌ను వాచ్‌మన్ గమనించి వెంటనే అధికారులకు సమాచారం అందించాడు.

 
హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. కాగా విద్యార్థి గదిలో సూసైడ్ నోట్ లభించింది. అందులో తన చావుకి ఎవరూ కారణం కాదనీ, తను గత కొన్నిరోజులుగా మెంటల్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు