తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శనివారం మైనర్ బాలికపై పూజారి అత్యాచారం చేస్తుండగా, బాలిక తండ్రి కంటపడ్డాడు. ఆ తర్వాత ఆ పూజారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ వృద్ధుడికి భార్య, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. కామాంధుడి పేరు ఘనశ్యామ్.
ఇదే విషయంపై ఆ బాలిక వద్ద ఆరా తీయగా, గత 3-4 రోజులుగా ఘనశ్యామ్ దాస్ బాబా తనని తన ఇంటికి పిలిపించి అసభ్యకర పనులు చేసేవాడని బాధితురాలు తన తండ్రితో చెప్పింది. ప్రతిఫలంగా డబ్బులు ఇచ్చేవారు, దీంతో పాటు ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించేవాడని వాపోయింది.