కాకినాడలో విషాదం ... కారులో ఊపిరాడక చిన్నారి మృతి

సోమవారం, 1 మే 2023 (13:55 IST)
ఏపీలోని కాకినాడలో ఒక విషాదకర ఘటన జరిగింది. ఓ చిన్నారి కారులో చనిపోయింది. కారులో ఉంచి డోర్లు లాక్ చేయడంతో ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన జిల్లాలోని కాజులూరు మండలం కోలంక గ్రామంలో జరిగింది. 
 
కారు డోర్ లాక్ పడటంతో ఊపిరాడక అఖిలాండేశ్వరి (8) అనే ఎనిమిదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. కిరాణా షాపుకు వెళ్లేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆ చిన్నారి రోడ్డుపై ఉన్న కారును ఎక్కింది. ఆ తర్వాత డోర్ లాక్ కావడంతో తిరిగి బయటకు వచ్చేందుకు వీలుపడలేదు. 
 
దీంతో ఊపిరాడక కన్నుమూసింది. ఇంటి నుంచి షాపుకు వెళ్లిన బిడ్డ ఎంతకూ రాకపోవడంతో తల్లిదండ్రులు ఊరంతా గాలించారు. చివరకు కారులో విగతజీవిగా పడివుండటాన్ని గుర్తించి బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు