కానీ వాళ్ళు చెప్పి మాటలను కొంతమంది ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఫోన్ లోనే స్నేహితులతో కలిసి కాల్స్, వీడియో కాల్స్, గేమ్స్, మెసేజెస్ వంటివి చేస్తూ ఫోన్ ద్వారా మరికొందరిని కొత్త వారిగా స్నేహం చేస్తూ ఉంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అదే స్నేహం చెడు చేస్తే మాత్రం స్నేహం చేసిన వారితో పాటు ఇంటిల్లిపాది ఇబ్బందులకు గురి అవుతారు.
ఫేస్ బుక్‌లో పరిచయం అయిన అపరిచితులను నమ్మి మోసపోకండి అని నిత్యం పోలీసులు వాట్సాప్‌లో, సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో మనల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. కానీ అంతా తెలిసిన వారే బాగా చదువుకున్న వారే అనామకులను నమ్మి నట్టేట మునుగుతుంటారు. ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది.
ఫేస్ బుక్ ఫ్రెండ్‌ను నమ్మి ఏకంగా తొమ్మిది లక్షల రూపాయలకు పైగా నగదు, నగలను సమర్పించుకుంది ఓ యువతి. తిరుపతి నగరంలోని టిటిడికి చెందిన ఒక ఇంజనీర్ కుమార్తెకు అనంతపురంకు చెందిన ఒక యువకుడు గత కొద్దిరోజుల క్రితం నుంచి ఫేస్ బుక్‌లో పరిచయం అయ్యాడు.