ప్రధాని, అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ.. ఎప్పుడు..? టీడీపీకి-జనసేనకు షాక్!

సోమవారం, 3 జులై 2023 (23:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వేడి మామూలుగా లేదు. ఇప్పటికే బీజేపీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు పెట్టుకునేందుకు చర్చలు జరిగాయి. జనసేన కూడా ఇందుకు మద్దతు తెలిపింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా బీజేపీకి గణనీయమైన సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. 
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ వారం ఢిల్లీలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ కానున్నట్టు సమాచారం. జూలై 5వ తేదీన ఈ సమావేశం జరిగే అవకాశం ఉందని రాజకీయ పార్టీ వర్గాలు తెలిపాయి. 
 
గత నెలలో తిరుపతి, విశాఖపట్నంలో వైకాపాను ఎండగడుతూ బహిరంగ సభలు నిర్వహించారు. ఇందులో పాల్గొని మాట్లాడిన అమిత్ షా, జేపీ నడ్డా జగన్మోహన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ పర్యటనలో జగన్మోహన్ పార్టీ నేతలను కలిసేందుకు ప్రయత్నించారు. అది జరగలేదు. తద్వారా బీజేపీ, తెలుగుదేశం మధ్య పొత్తు ఖాయమని భావిస్తున్నారు. అయితే తాజాగా ఏపీ సీఎం జగన్ అమిత్ షాను కలవనున్నారనే వార్త బీజేపీ, టీడీపీ వర్గాలకు షాకిచ్చేలా చేసింది.  
 
దీనిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ:- మేం ఎప్పటికీ బీజేపీకి మద్దతివ్వం. ఇది సంకీర్ణంలో భాగం కాదు. అయితే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం. పార్టీగా మేం స్వతంత్రులం. ప్రజాకూటమి కోసం కేంద్ర ప్రభుత్వంతో సామరస్య బంధం కొనసాగుతుందని సజ్జల అన్నారు. అయితే ఏపీ సీఎం జగన్ ప్రధాని, అమిత్ షాలతో భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు