రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఒక్క యూపీలోనే 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు వెళ్లారు. ప్రస్తుతం చిరంజీవిని కూడా యూపీ కోటాలోనే రాజ్యసభకు పంపాలని బీజేపీ భావిస్తోంది. అయితే ఈ ప్రతిపాదనను మెగాస్టార్ చిరంజీవి ఎంతవరకు అంగీకరిస్తారనేది తెలియాల్సి వుంది.
యూపీఏ హయాంలో చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయాల కోసం పదేళ్ల పాటు సినిమాలకు దూరమైన చిరంజీవి.. మళ్లీ సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాజకీయాల్లోకి ఆయన వెళ్తారా అనేది చర్చనీయాంశమే. కాగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.