కర్ణాటక రాష్ట్రంలో ఉన్న హంపీ నగరానికి అరుదైన గుర్తింపు, స్థానం లభించింది. ప్రపంచంలో ఉన్న చూడచక్కని స్థలలు, చూడాల్సిన స్థలాల్లో హంపీకి రెండోస్థానం వరించింది. ముఖ్యంగా, జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ప్రాంతంగా హంపీ గుర్తింపుపొందింది. ఈ మేరకు ది న్యూయార్క్ టైమ్స్ పత్రిక తాజా మ్యాగజైన్‌లో వెల్లడించింది.
కాగా, హంపీ నగరం తుంగభద్ర నదీ తీరంలో 26 కిలోమీటర్ల పొడవునా విస్తరించిన ఈ చారిత్రక ప్రదేశం. ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. విదేశీయులు కూడా ప్రశంసలు కురిపించారు. 2016-17 సంవత్సరంలో 5.35 లక్షల మంది హంపీని సందర్శించారు. వీరిలో 38 వేల మంది విదేశీ పర్యాటకులే ఉన్నారు.