అయితే వైసిపిలో చేరకుండా పవన్ కళ్యాణ్ పైన ఉన్న అభిమానంతో మనోహర్ జనసేనలో ఉన్నారు. ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఎప్పుడు కూడా పదవి గురించి పట్టించుకోని నాదెండ్ల మనోహర్ వైసిపి, టిడిపిపై తనదైన శైలిలో విమర్సలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏ సమావేశానికి హాజరైనా కూడా ఆ సమావేశానికి వస్తుంటారు.
బిజెపితో సన్నిహితంగా కలిసి ఉన్నప్పుడు ఆ పార్టీ గురించి మాట్లాడడం భావ్యం కాదని.. పొత్తుల గురించి.. పార్టీని వదిలేయడం లాంటి విషయాలు ప్రస్తావించడం చేయకూడదన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనట. అయితే దీన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నాదెండ్ల మనోహర్ కొన్ని విషయాలు బయట మాట్లాడడం పవన్‌కు కోపం తెప్పించినట్లు తెలుస్తోంది.
దీంతో విశాఖ ప్లాంట్ పైన జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ చాలాసేపు పవన్ కళ్యాణ్‌తో మాట్లాడే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం మాట్లాడలేదట. వినీవిన్నట్లు సైలెంట్‌గా ఆ సభలో ఉండిపోయారట పవన్ కళ్యాణ్. నాదెండ్ల మనోహర్ తన తీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి కూడా బయటకు పంపించాలన్న నిర్ణయానికి జనసేనాని వచ్చినట్లు తెలుస్తోంది.