ఏమో, రిలయన్స్ జియో ఫ్యూచర్ ఎలా వుంటుందో? సైడ్‌గా బీఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్టెల్ కనెక్షన్ కూడా పడేసి వుంచుదాం.. అంటున్నారు కొందరు. అదేంటయా ఉచితంగా రిలయన్స్ జియో ఆఫర్లు ఇస్తుంటే చక్కగా కాలు మీద కాలేసుకుని గంటలు గంటలు మాట్లాడుకుంటూ రోజుల తరబడి నెట్లో చూసుకోవచ్చు కదా అని అడిగితే వాళ్ల వద్ద నుంచి రకరకాల ఆన్సర్లు వస్తున్నాయి. దీనితో ఉచితంగా వాయిస్ కాల్స్, డేటా ఇస్తుంటే భయపడతారేంటి ----నాధా అనాల్సి వస్తోంది. ఈ డైలాగును అత్తారింటికి దారేది చిత్రంలో పోసాని వాడారని గుర్తుంది కదా. ఇకపోతే రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్షిప్ రేపటి నుంచి అమల్లోకి రానుంది.