తెలంగాణ రాజకీయాలలో కుటుంబ ఆధిపత్యంతో పాటు కవిత లిక్కర్ స్కామ్ బీఆర్ఎస్ ఓటమికి దారి తీసిందని టాక్ వస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్, రిమాండ్ రిపోర్ట్‌లో ప్రముఖంగా ఆమె ప్రమేయం ఆరోపణలతో కవిత ప్రతిష్టను మరింత దిగజార్చింది.
స్కామ్‌లో కవిత పాత్ర వెలుగులోకి రావడంతో పార్టీకి చాలా నష్టం జరిగిందని టాక్ వస్తోంది. కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు పార్టీ విశ్వసనీయతను దెబ్బతీశాయని, గతంలో తమ బీజేపీ వ్యతిరేక వైఖరి నుంచి దృష్టి మరల్చి, బీఆర్‌ఎస్‌తో కుమ్మక్కయ్యారనే భావనను పెంపొందించిందని పార్టీ నేతలు నొక్కి చెప్పారు.