ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన కుమారుడు నారా లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. లోకేష్‌కు మంత్రిపదవి ఇవ్వాలనుకున్న చంద్రబాబు ముందుగా ఆ మాటను పార్టీ నాయకుల చేత చెప్పించాలనుకున్నారు. అంతే సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మొదలుకుని బెజవాడ నేతల వరకు అంతా లోకేష్‌కు మంత్రి ఇవ్వాల్సిందేనని చెప్పుకొచ్చారు.
నారా లోకేష్ కంటే ముందు.. హిందూపురం ఎమ్మెల్యే.. నందమూరి హీరో బాలయ్య బాబుకు మంత్రి పదవి ఇవ్వాలని మోహన్ పట్టుబడుతున్నారు. లోకేష్‌కు మంత్రి పదవి ఇవ్వాలంటూనే బాలకృష్ణ కూడా మంత్రి పదవికి అర్హుడేనంటూ మరోవాదన లేవనెత్తారు. ఇప్పుడు మోహన్ దారిలోనే మరికొందరు నేతలు కూడా బాలయ్య రాగం అందుకుంటే మాత్రం చంద్రబాబుకు తిప్పలు తప్పకపోవచ్చు.