National Youth Day: స్వామి వివేకానంద యువతకు మార్గనిర్దేశం

బుధవారం, 12 జనవరి 2022 (09:53 IST)
National Youth Dayను జనవరి 12న స్వామి వివేకానంద జయంతి రోజున జరుపుకుంటున్నారు. గొప్ప తత్వవేత్తలలో ఒకరైన స్వామి వివేకానంద జీవితం, బోధనలను గౌరవించటానికి భారతదేశం ఈ రోజు జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజు వివేకానంద స్పూర్తిదాయకమైన ఆలోచనలను, యువత వాటి నుండి ఎలా ప్రయోజనం పొందుతారని జరుపుకుంటారు.

 
19వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ పరమహంస ప్రధాన శిష్యుడు, వివేకానంద వేదాంత- యోగా యొక్క భారతీయ తత్వాలను ప్రపంచానికి పరిచయం చేశారు. జనవరి 12, 1863న స్వామి వివేకానంద ఉత్తర కలకత్తాలో నరేంద్రనాథ్ దత్తగా జన్మించారు. భారతదేశంలో హిందూమతం యొక్క పునరుజ్జీవనం వెనుక ఒక ప్రధాన శక్తిగా పరిగణించబడ్డారు.

 
1881లో మొదట రామకృష్ణ పరమహంసను కలుసుకున్నారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు వివేకానంద. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ను స్థాపించిన వివేకానంద వలస భారతదేశంలోని ప్రజలలో జాతీయతా భావాన్ని నింపిన ఘనత కూడా ఉంది. ఈ రెండూ వేదాంతానికి సంబంధించిన తత్వశాస్త్రం, సూత్రాల బోధనకు ముఖ్యమైన కేంద్రాలుగా మారాయి.

 
వివేకానందుడు హిందూ తత్వశాస్త్రం-వేదాంత బోధలపై ఆయన చేసిన గ్రంథాలు - జ్ఞాన-యోగ, భక్తి-యోగ, కర్మ-యోగ మరియు రాజ-యోగ అనే నాలుగు అంశాలపై రచనలు చేసారు. వివేకానంద చికాగోలో పాశ్చాత్య ప్రపంచానికి హిందూమతాన్ని పరిచయం చేస్తూ 1893లో తన ప్రసిద్ధ ప్రసంగానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మతోన్మాద ప్రమాదాల గురించి కూడా ఆయన హెచ్చరించాడు. సమాజాన్ని ఉద్దరించడానికి అనుసరించాల్సిన మార్గాలను ఆయన ఎన్నో చెప్పారు.
Koo App
అత్యున్నత లక్ష్యానికి జీవితాన్నంతా ధారపోయమని సందేశాన్నిచ్చిన సంస్కరణవాది, విశ్వమానవుడు వివేకానందుని జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళి. దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన వివేకానందుని మార్గం అందరికీ ఆదర్శం. #NationalYouthDay
 
- YS Jagan Mohan Reddy (@ysjagan) 12 Jan 2022

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు