అసలు నేతాజీ రహస్య దస్త్రాల్లో ఏముంది..? ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వాస్తవాలు

ఆదివారం, 24 జనవరి 2016 (10:33 IST)
భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు సంబంధించిన రహస్య దస్త్రాలను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆయన మృతిపై దేశ ప్రజలకు కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నేతాజీ చరిత్రకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. 
 
ఈ రహస్య పత్రాల్లో కీలక సమాచారం ఉంది. ప్రమాదం జరిగిన ఐదు రోజుల తర్వాత బ్రిటన్‌ అత్యున్నత అధికారులు ఆర్‌.ఎఫ్‌.మూడీ, ఇవాన్‌ జంకిన్స్‌లు నేతాజీని యుద్ధ నేరస్థుడిగా ప్రకటిస్తే ఎదురయ్యే పరిణామాలపై బేరీజు వేశారు. ఈ సందర్భంగా వారికి తట్టిన అత్యుత్తమమార్గం నేతాజీ విషయాన్ని అంతటితో వదిలేయడమే. ఆయన ఎక్కడైనా యుద్ధఖైదీగా ఉన్నా ఆయన విడుదల కోరకపోవమే. ఆ రకంగానైనా అతను బతికి ఉంటాడని భావించారు. తొలుత ఆయన రష్యా చేరుకుంటే కొన్ని సమస్యలు వస్తాయని భావించినా తర్వాత ఆ వాదనను తోసిపుచ్చారు. 
 
ఇదే విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన 100 రహస్యపత్రాల్లో ఉంది. దాదాపు 16,600 పేజీలు ఉన్న పత్రాలు కుదించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. కేబినెట్‌ నోట్‌ ఫిబ్రవరి 6, 1995లో కేంద్ర హోం శాఖ కార్యదర్శి పద్మనాభయ్య పంపిన కేబినెట్‌ నోట్‌ నేతాజీ మరణానానికి సబంధించి దాదాపు ధ్రువీకరించింది. '1948 ఆగస్టు 18న జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మృతి చెందారు. ఇందులో ఎటువంటి సందేహంలేదు. దీనిని భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఈ పరిస్థితికి విరుద్ధంగా ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేవు' అని వాటిలో ఉంది. 
 
అయితే, 'దేశంలోని కొంత మంది దీనిని నమ్మటంలేదు. వారు నేతాజీ ఇప్పటికీ బతికే ఉన్నారని వారు నమ్ముతున్నారు. ఆయన ప్రజలకు దూరంగా జీవిస్తున్నట్లు విశ్వశిస్తున్నారు. అవసరమైనప్పుడు కనిపిస్తారని కూడా అనుకుంటున్నారు. కానీ వాటిల్లో ఏవీ తర్కబద్ధంగా లేవు' అని విశ్లేషించారు. జపాన్‌లో నేతాజీ జ్ఞాపకాలను భారత్‌కు తెచ్చే విషయమై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునేందుకు ఈ నోట్‌ను తయారు చేశారు. దివంగత ఎంపీ సమర్‌ ఘోష్‌ నేతాజీ మాస్కో రేడియోలో 1966లో ప్రసంగించిన విషయాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తినట్లు కూడా ఈ రహస్య పత్రాల్లో బహిర్గతమైంది. అలాగే, ఆదివారం కూడా మరికొన్ని రహస్య పత్రాలను బయటకు విడుదల చేయనున్నారు. 

వెబ్దునియా పై చదవండి