భూమికి పొంచివున్న సౌర తుఫాను ముప్పు తొలగిపోయింది. ఈ తుఫాను భూనికి తాకడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే ఆ సౌర తుఫాను బుధవారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు చెందిన నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్ఓఏఏ) వెల్లడించింది.
లెవల్ 4 సూచిస్తోందంటే ఇది స్వల్పమైన ప్రభావం చూపినట్లు అర్థం. ఈ సౌర తుఫాను కారణంగా బలహీనమైన పవర్ గ్రిడ్ ఫ్లక్చువేషన్లు కనిపించాయని, ఇక కెనడా, అలాస్కాలాంటి ప్రాంతాల్లో అరోరాలు కూడా కనిపించినట్లు ఎన్ఓఏఏ వెల్లడించింది.