తాలిబన్ల విజయం.. వారికి ధైర్యం?

శనివారం, 11 సెప్టెంబరు 2021 (22:44 IST)
న్యూయార్క్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు సాధించిన విజయంపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వీరి విజయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర తీవ్రవాద సంస్థలకు ధైర్యాన్నిచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే తాలిబన్లతో చర్చలు జరపాల్సిన అవసరమూ ఉందన్నారు. అంతర్జాతీయ సంబంధాల్లో అఫ్గాన్‌ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు.
 
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదులు పట్టు సాధిస్తున్నారని గుటెర్రస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆఫ్రికాలోని సహేల్‌ ప్రాంతంలో తీవ్రవాదుల దుశ్చర్యలను ఆయన ఉటంకించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు వారికి మరింత ధైర్యాన్నిచ్చే ప్రమాదం ఉందన్నారు.

చాలా దేశాలు ఉగ్రవాదాన్ని సమర్థంగా తిప్పికొట్టే పరిస్థితుల్లో లేవన్నారు. యావత్‌ ప్రపంచం ఏకతాటిపై నిలబడితేనే ఎదుర్కోగలమన్నారు. ఆయుధాలు చేబట్టి.. చావడానికి కూడా సిద్ధపడిన ఉన్మాదులను ఎదుర్కోవడం కష్టతరమన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు