యురేనియం ప్రకృతి సహజసిద్ధంగా భూమిలో, నీటిలో లభించే అణుధార్మిక రసాయన మూలకం. ఇది మూడు ఐసోటోపుల మిశ్రమం. దీనిని అణ్వాయుధాలలో, అణురియాక్టర్లలో ఇంధనంగా వాడుతారు. ప్రకృతిలో యురేనియం ప్రధానంగా మూడు రూపాలలో లభిస్తుంది.
అవి యూ 238, యూ 235, యూ 234, యూ 235 అనేది అణురియాక్టర్లు అణ్వాయుధాల్లో వాడే అతి ముఖ్యమైన ఇంధనం. భూమి పొరల్లో 2-4 పార్ట్ మిలియన్‌గా లభిస్తుంది.
భారత్‌లో ప్రధానంగా మేఘాలయ, అస్సాం, నాగాలాండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి. భారత్‌లోని ఈ ప్రాంతాలన్ని కూడా దట్టమైన అడవులతో ఉన్న ప్రాంతాలు కాబట్టి సహజంగానే ఇవి ఖనినజ నిక్షేపాలను తమ కడుపులో దాచుకున్నాయి.