కావలసిన పదార్థాలు: మైదాపిండి: 250 గ్రాములు గోధుమ పిండి: 250 గ్రాములు నీరు: సరిపడా ఉప్పు: తగినంత నూనె: వేయింపుకు సరిపడా అజ్వైన్: అర టీ స్పూన్ మిరియాలు : రెండు టీ స్పూన్లు ( ముక్కలు చేసినవి)
తయారీ విధానం: మైదాపిండి, గోధుమ పిండి, నెయ్యి, అజ్వైన్, మిరియాల చిన్న ముక్కలు, ఉప్పును సరిపడా నీటితో కలిపి చపాతీ పిండిలా చేసుకోండి. ఈ పిండిని చపాతీలా రుద్దుకుని రిబ్బన్ ముక్కల్లా షేప్ చేసుకోండి. ఓ బాణలిలో నూనెను పోసి వేడయ్యాక షేప్ చేసిన ముక్కల్ని నూనెలో వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయండి. వీటిని సీసాలో గానీ ఏదేని మూతపెట్టి ఉంచే పాత్రలో భద్రపరిస్తే చాలా రోజులు పాటు అలాగే ఉంటాయి.