దీపావళి వచ్చేసింది.. ఈ పండుగలో తీపి పదార్థాలకు ప్రత్యేక స్థానముంది. పిండి వంటలు, తీపి పదార్థాలను ఇంట తయారు చేసి.. ఇరుగుపొరుగు వారికి బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అలాంటి దీపావళి పండుగ రోజున కొబ్బరి బొబ్బట్లను ఇంట్లో ఎలా చేయాలో చూద్దాం..
నూనె లేదా నెయ్యి - వంద గ్రాములు,
గసగసాలు - వంద గ్రాములు.
బెల్లం లేదా పంచదార - పావుకేజీ,
తయారీ విధానం:
ముందుగా కొబ్బరి తురుము, బెల్లాన్ని ఓ ప్యాన్‌లో వేసి సన్నని సెగపై ఫ్రై చేయాలి. కొబ్బరి, బెల్లం ఉడికి ముద్దలా అయి తీగపాకం వచ్చాక దించాలి. తర్వాత బాగా మెదిపి యాలకుల పొడి, దోరగా వేయించిన గసగసాలు వేయాలి. తర్వాత ఈ కొబ్బరి ముద్దను నిమ్మకాయ సైజులో ముద్దలుగా చేసుకోవాలి. మైదాపిండిలో నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి మూడు గంటల పాటు నానబెట్టుకోవాలి.
ఈ మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని ఒక్కోదాన్ని చిన్నపూరీలా ఒత్తి, అందులో కొబ్బరి ముద్ద పెట్టి పూరీతో చుట్టేసి చేత్తో లేదా అప్పడాల కర్రతో సున్నితంగా వత్తాలి. వీటిని బొబ్బట్ల మాదిరిగానే పెనం మీద నెయ్యి లేదా నూనె వేసి రెండువైపులా దోరగా కాల్చాలి. అంతే కొబ్బరి బొబ్బట్లు రెడీ.