ఎన్నికలు 2014.... ఏకాంబర కుప్పంలో ఆ దెబ్బకు పడిపోయిన రోజా
శుక్రవారం, 2 మే 2014 (13:34 IST)
FILE
సినీ నటి రోజా ఎన్నికలు 2014లో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా ప్రచారాం చేస్తోంది. నగరి నియోజకవర్గం నుంచి వైఆర్సీపీ నుంచి బరిలోకి దిగిన రోజా గత కొన్ని రోజులుగా ఎర్రగా మండుతున్న ఎండను సైతం లెక్కచేయకుండా ప్రచారం చేస్తోంది.
దీంతో రోజాకు వడదెబ్బ తగిలి ఎకాంబరకుప్పంలో ప్రచారం చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయింది. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.