నరేంద్ర మోడీ - చంద్రబాబులకు మతిమరుపు వచ్చిందా?

బుధవారం, 30 ఏప్రియల్ 2014 (17:23 IST)
File
FILE
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడులకు ఏమైనా మతిమరుపు వచ్చిందా అనే సందేహం కలుగుతోంది. ప్రజా ప్రతినిథ్య చట్టంలోని ఎన్నికల నియమావళి మేరకు పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓటింగ్ యంత్రంలో తమ ఓటును ఎవరికి వేశామో బహిర్గతం చేయరాదు.

కానీ, నరేంద్ర మోడీ, చంద్రబాబులిద్దరూ ఈ విషయాన్ని మరచిపోయారు. ఫలితంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురయ్యారు. బుధవారం జరిగిన ఏడో దశ పోలింగ్‌లో అహ్మదాబాద్‌లోని గాంధీ నగర్ పరిధిలో నరేంద్ర మోడీ ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కమలం గుర్తును చూపించి ఈసీకి చిక్కారు. దీంతో ఆయనపై చర్య తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

అలాగే, జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు నాయుడు... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ - బీజేపీ పొత్తు ధర్మం మేరకు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటును బీజేపీ అభ్యర్థికి వేసినట్టు చెప్పారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆయన ఓటు చెల్లదని ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి