ఎన్నికలు 2014... రెడ్డి అండ్ రెడ్డి కారు నుంచి ఆగని నోట్ల కట్టల ప్రవాహం...

సోమవారం, 5 మే 2014 (18:20 IST)
FILE
భీమవరంలో ఆదివారంనాడు రెడ్డి అండ్ రెడ్డి కార్ల షోరూము గ్యారేజీలో ఉన్న ఓ కారు నుంచి కోట్ల రూపాయల నగదు కట్టలు బయటపడుతున్నాయి. నిన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడిన సంగతి తెలిసిందే.

మళ్లీ అదే కారును మరోసారి పోలీసులు ఆసాంతం పరిశీలిస్తే మరో కోటి రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో ఆ కారుకు సంబంధించిన టైర్లు, ట్యూబులు ఇలా అన్ని స్పేర్ పార్టులను విడివిడిగా పరిశీలించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గరగపర్రులోని రెడ్డి అండ్ రెడ్డి కార్ల షోరూమ్ గ్యారేజీలో ఉంచిన ఈ కారులో అన్నీ వెయ్యి, ఐదు వందల నోట్ల కట్టలు ఉన్నాయి. మొత్తమ్మీద ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నగదు ప్రవాహం దేశాన్నే విస్మయపరుస్తోంది.

వెబ్దునియా పై చదవండి