జనసేన పవన్ మోడీకి ఓటు గుద్ది వేశారా.... జూ.ఎన్టీఆర్ ఓటు సైకిలుకేనా...?
బుధవారం, 30 ఏప్రియల్ 2014 (18:49 IST)
File
FILE
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఓటు ఎవరికి వేసి ఉంటారు... అంటే మోడీ పార్టీ కమలంపైన కాక మరెవరికి వేస్తారూ అంటూ ఆయన ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారనుకోండి. మొత్తమ్మీద ఓటు మోడీకి వేసి ఓ పార్టీ అధ్యక్షుడుగా పవన్ సంచలనం సృష్టించాడు.
ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్టీఆర్ ను, హరికృష్ణను ఈ ఎన్నికలకు చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టిన నేపధ్యంలో ఎన్టీఆర్ ఎవరికి ఓటు వేసి ఉంటారన్నది ఆసక్తిగా మారింది. ఐతే గతంలో ఎన్టీఆర్ చెప్పినట్లు తాను బతికి ఉన్నన్నాళ్లు తాతయ్య సైకిలు గుర్తుకే సపోర్టు అన్నారు. కనుక అదే ఓటు ముద్ర అనుకోవచ్చు.