టీ కాంగ్రెస్ లిస్ట్ : సబిత - శంకర్రావు సీట్లు గల్లంతు : వీహెచ్‌కు ఓకే!
సోమవారం, 7 ఏప్రియల్ 2014 (20:09 IST)
File
FILE
కాంగ్రెసు తెలంగాణ శాసనసభ అభ్యర్థుల జాబితాను పార్టీ అధిష్టానం సోమవారం రాత్రి విడుదల చేసింది. 111 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేయగా, ఈ సారి శాసనసభకు హేమాహేమీలను రంగంలోకి దింపుతోంది. చాలా వరకు సిట్టింగ్ శాసనసభ్యులకు టికెట్లను ఖరారు చేసిన ఏఐసీసీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి శంకర్రావుకు మొండిచేయి చూపింది.
అలాగే, రాజ్యసభ సభ్యుడు వీహెచ్‌ను అంబర్‌పేట అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించనుంది. అలాగే, టీఆర్ఎస్ మాజీ ఎంపీ విజయశాంతిని కూడా అసెంబ్లీకే పంపుతోంది. ఈమెను మెదక్ శాసనసభా స్థానం నుంచి పోటీకి దించుతోంది. సనత్‌నగర్ సీటును మర్రి శశిధర్ రెడ్డికే ఖరారు చేయగా, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య జనగామ టిక్కెట్‌ను కేటాయించారు.
తెలంగాణలో సీపీఐతో పొత్తు పెట్టుకున్నట్టు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ... ఆ పార్టీకి ఝులక్ ఇచ్చింది. తొలుత 9 సీట్లు కేటాయించేందుకు సమ్మతించిన ఏఐసీసీ ఇపుడు కేవలం 7 సీట్లను మాత్రమే వదిలివేసింది. అలాగే, సిట్టింగ్ సభ్యులందరికీ సీట్లు కేటాయించి, రాజకీయ నేతల వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే, తెలంగాణ జేఏసీ నేతలకు కూడా కాంగ్రెస్ హైకమాండ్ మొండిచేయి చూపింది. కాగా, తెలంగాణలోని అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల కొంతమంది పేర్లు.
1. సిర్పూర్ - ప్రేమ సాగర్ రావు 2. చెన్నూరు - వినోద్ 3. బోధన్ - సుదర్శన్ రెడ్డి 4. మంచిర్యాల - అరవింద రెడ్డి 5. కామారెడ్డి - షబ్బీర్ అలీ 6. జగిత్యాల - జీవన్ రెడ్డి 7. అంబర్ పేట - వి.హనుమంతరావు 8. ఖైరతాబాద్ - దానం నాగేందర్ 9. యాకుత్ పురా - సదానంద్ 10. మెదక్ - విజయశాంతి 11. ఎల్బీనగర్ - సుధీర్ రెడ్డి 12. నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి 13. బాల్కొండ - ఎరవతి అనిల్ 14. రామగుండం - సలీం పాషా 15. కోరుట్ల - కొమ్మిరెడ్డి రాములు 16. పెద్దపల్లి - భానుప్రసాదరావు 17. ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు 18. ఖానాపూర్ - అజ్మీరా హరినాయక్ 19. బాన్సువాడ - బాలరాజు 20. నిజామాబాద్ అర్భన్ - మహేష్ గౌడ్ 21. జూబ్లీహిల్స్ - విష్ణువర్థన్ రెడ్డి 22. సనత్ నగర్ - మర్రి శశిధర్ రెడ్డి 23. మల్కాజ్ గిరి - నందికంటి శ్రీధర్ 24.శేరిలింగంపల్లి - భిక్షపతి యాదవ్ 25. మలక్ పేట - వి.ఎన్.రెడ్డి 26. బహదూర్ పురా - సయ్యద్ అబ్దుల్ సమీ 27. సిద్ధిపేట - శ్రీనివాస్ గౌడ్ 28. కార్వాన్ - రూప్ సింగ్ 29. నిజామాబాద్ (రూరల్) - ధర్మపురి శ్రీనివాస్ 30. కరీంనగర్ - లక్ష్మీ నర్శింహారావు 31. మంథని - శ్రీధర్ బాబు 32. సిరిసిల్ల - రవీందర్ 33. ఆదిలాబాద్ - భార్గవ్ దేశ్ పాండే 34. జుక్కల్ - గంగారాం 35. నారాయణపేట - వి.కృష్ణ 36. ఎల్లారెడ్డి - సురేంద్ర 37. నారాయణఖేడ్ - కృష్ణారెడ్డి 38. పెద్దపల్లి - భానుప్రసాదరావు 39. పటాన్ చెరు - నందీశ్వర్ గౌడ్ 40. చొప్పదండి - సుద్దాల దేవయ్య 41. నర్సాపూర్ - సునీతా లక్ష్మారెడ్డి 42. షాద్ నగర్ - ప్రతాప్ రెడ్డి 43. నాగార్జునసాగర్ - జానారెడ్డి 44. ఆసిఫాబాద్ - ఆత్రం సక్కు 45. ఖానాపూర్ - అజ్మీరా హరినాయక్ 46. బాన్సువాడ - బాలరాజు 47. నిజామాబాద్ అర్బన్ - మహేష్ గౌడ్ 48. ముషీరాబాద్ - వినయ్ కుమార్ 49. నాంపల్లి - వినోద్ కుమార్ 50. జడ్చర్ల - మల్లురవి 51. మానకొండూరు - ఆరేపల్లి మోహన్ 52. జహీరాబాద్ - గీతారెడ్డి 53. కొడంగల్ - విఠల్ రావు 54. నాగర్ కర్నూల్ - దామోదర్ రెడ్డి 55. హుస్నాబాద్ - ప్రవీణ్ రెడ్డి 56. ఆందోల్ - దామోదర రాజనర్సింహ 57. సంగారెడ్డి - జగ్గారెడ్డి 58. అచ్చంపేట - వంశీకృష్ణ 59. హుజుర్ నగర్ - ఉత్తమ్ కుమార్ రెడ్డి 60. వేములవాడ - బొమ్మ వెంకటేశ్వర్లు 61. సిర్పూర్ - ప్రేమ సాగర్ రావు 62. చెన్నూరు - వినోద్ 63. బోధన్ - సుదర్శన్ రెడ్డి 64. మంచిర్యాల - అరవింద రెడ్డి 65. కామారెడ్డి - షబ్బీర్ అలీ 66. జగిత్యాల - జీవన్ రెడ్డి 67. నిర్మల్ - మహేశ్వర్ రెడ్డి 68. బాల్కొండ - ఎరవతి అనిల్ 69. రామగుండం - సలీం పాషా 70. కోరుట్ల - కొమ్మిరెడ్డి రాములు 71. కల్వకుర్తి - చల్లా వంశీచందర్ రెడ్డి 72. తాండూరు - నారాయణరావు 73. వికారాబాద్ - గడ్డం ప్రసాద్ 74. దేవరకద్ర - పవన్ కుమార్