పవన్ కళ్యాణ్ కు పిచ్చి ముదిరిందట... భయపడుతున్నారా...?
సోమవారం, 5 మే 2014 (17:04 IST)
WD
పవన్ కళ్యాణ్ ఒక తెలివితక్కువ వాడనీ, అతడికి పిచ్చి ముదిరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. పవన్ మాట్లాడుతున్న తప్పుడు మాటలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కు బాగా పిచ్చి ముదిరిపోవడంతో ఇలా మాట్లాడుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఐతే పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలెట్టిన దగ్గర్నుంచి జగన్ గ్రాఫ్ మెల్లిగా కిందికి వంగిందన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో పవన్ చూసి వైకాపా భయపడుతుందనే కామెంట్లు వినబడుతున్నాయి.
ఇక చంద్రబాబు నాయుడు కేవలం అధికారంలోకి వచ్చేందుకు మాత్రమే పదవులను ఎరగా వేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎలాగూ అధికారంలోకి రామనే ఉద్దేశ్యంతోనే బీసీలకు సీఎం పోస్టు అంటూ ఆశ పెడుతున్నారని అన్నారు. విపరీతంగా మద్యాన్ని, డబ్బును పంచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగన్ సత్తా ముందు చంద్రబాబు కుయుక్తులు ఏమీ పనిచేయవని అన్నారు.