పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్టార్ కాలేరు.. ఓన్లీ సినీ స్టార్... జయప్రద సెటైర్

బుధవారం, 9 ఏప్రియల్ 2014 (18:57 IST)
WD
రాష్ట్రీయ లోకదళ్ నాయకురాలు, ఒకనాటి టాలీవుడ్ నటి జయప్రద జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై చాలా ఆలస్యంగా స్పందించినా ఓరకంగా షాక్ ఇచ్చారు. మరోవైపు తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపైనా మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రంపై జయప్రద మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసలు రాజకీయ నాయకుడు కానే కారని అన్నారు.

జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. సహజంగా ఏ సినీ స్టార్ జనం మధ్యకు వచ్చినా జనం వస్తారు కానీ, వారంతా ఓట్లు వేస్తారనుకోవడం పొరపాటని చెప్పుకొచ్చారు. ఎందరో సినీ స్టార్లు పార్టీలు పెట్టి ఆ తర్వాత విఫలమయ్యారని అన్నారు. ఇండైరెక్టుగా చిరంజీవికి కూడా ఇలా చురక అంటించారు.

అన్యాయం చేసే ప్రభుత్వాలను జనసేన తాట తీస్తుందన్న పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలా ముందుకు వెళతారో చూడాల్సి ఉందన్నారు. ఇక చంద్రబాబు నాయుడికి ఒక విధానమనేది లేదని ఎద్దేవా చేశారు. జగన్ విశ్వసనీయత ఉన్న నాయకుడంటూ ఆమె కొనియాడారు.

వెబ్దునియా పై చదవండి